గ్రామ, సచివాలయ పరీక్షలు..
003, 4, 6, 7 తేదీల్లో లోకల్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం..
విజయవాడ : గ్రామ, సచివాలయ పరీక్షలు దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 3, 4, 6, 7 తేదీల్లో లోకల్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం..
ఈమేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ..
సెప్టెంబర్ 1 నుంచి 8 వరకూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం.
ఏపీలో మొత్తం 1,26,728 పోస్టులకు
భారీ స్థాయిలో వివిధ కేటగిరీ లకు 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు.
పరీక్షల నిర్వహణ బాధ్యతలను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) లకు అప్పగించిన ప్రభుత్వం.
అభ్యర్థుల భారీ సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లోను నగర/పట్టణ , మండలాల్లో పరీక్షా కేంద్రాల ఎంపిక.
సెప్టెంబర్ 1, 8 తేదీల పరీక్షల షెడ్యూల్ ఆదివారాల్లో రావడంతో ఆ రోజు పాఠశాలలు/కళాశాలలు పని చేయవు..
దీంతో పని దినాలైన
3, 4, 6, 7 ,తేదీల్లో పాఠశాలలు/కళాశాలలకు లోకల్ హాలిడేస్ ఇచ్చి, పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం..
కేవలం పరీక్షా ప్రతిభ ఆధారంగానే ఈ ఉద్యోగాల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఎంపికైన అభ్యర్థులను అక్టోబరు 1నుంచి విధుల్లోకి తీసుకుంటారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టిక్కెట్లను కొన్ని గంటల్లో వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతారు.